KRNL: సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, సౌకర్యాలు కూడా కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి T.G.భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, MP బస్తిపాటి నాగరాజు, MLAలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు.