SRPT: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం పుణ్యకార్యమని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరి, శ్రీధర్ పట్టణ ట్రాఫిక్ ఎస్సై మల్లేష్లు పేర్కొన్నారు. సోమవారం ఉమా శ్రీధర్ల 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కోదాడలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు.