సత్యసాయి: జిల్లా రైతులకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడో విడత నిధులు శుక్రవారం జమ కానున్నాయి. జిల్లాలోని 2,65,262 మంది రైతుల ఖాతాల్లో రూ.155.27 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.