TG: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో సర్కారు ఉందన్నారు. విద్యారంగంపై కమిటీ ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎవరితోనూ చర్చించకుండా నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటీ అని ప్రశ్నించారు.