TG: కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. దాదాపు 10రోజుల తరువాత ఎగువ నుంచి 66,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. అంతే నీటిని నాలుగు గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 33 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.