AP: రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై తాజాగా ఆయన టీం స్పందించింది. ‘ఆ సభలలో గురువు గారు అలా మాట్లాడలేదని.. వేరే సందర్భంలో.. గురువు గారు మాట్లాడిన మాటలను కలిపి.. ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని వివరణ ఇచ్చింది.