సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఎలి లిల్లీ భారత్‌లో ఊబకాయం తగ్గుదల, టైప్-2 డయాబెటిస్ నివారణకు ‘మోంజారో’ ఇంజెక్షన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ.3,500/వయల్ (2.5mg), రూ.4,375/వయల్ (5mg). క్లినికల్ ట్రయల్ ప్రకారం దీన్ని 15mg మోతాదులో వాడితే 72 వారాలలో 21.8 కిలోలు, 5mg వాడితే 15.4 కిలోల బరువు తగ్గడానికి దారితీస్తుంది.