దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు 45 ఏళ్లలోపు యువతేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పక్షవాతం పడిన వారిలో 3 నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణించడం లేదా తీవ్ర అంగవైకల్యం బారినపడటం వంటివి జరుగుతున్నాయి. మొత్తం రోగుల్లో మహిళలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండగా.. పురుషుల్లో పొగాకు, మద్యపానం వినియోగం అత్యధికంగా ఉందని తేలింది.