TG: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆత్మహత్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని.. ఆటలు బాగా ఆడాలని ప్రోత్సహించారు.ఈ క్రమంలో భద్రాచలం మూవీలోని ‘ఒకటే జననం.. ఒకటే మరణం’ పాటను సెల్ఫోన్లో పెట్టి వినిపించారు. ఆత్మహత్యలు ఎందుకు.. జీవితంలో ఎదురుతిరిగి గెలవాలి అని సూచించారు.