MBNR: దేవరకద్రలో దసరా పండుగ నాటికి కోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో లా సెక్రటరీ పాపిరెడ్డిని ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తన విజ్ఞప్తి మేరకు లా సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అడ్వకేట్లు పాల్గొన్నారు.