ASR: పెద్దవలస అటవీ రేంజ్ పరిధి సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని చింతపల్లి డీఎఫ్వో నరసింగరావు శుక్రవారం తెలిపారు. ఒక బీట్ ఆఫీసర్, పదిమంది బేస్ క్యాంపు సిబ్బందితో నిరంతర గస్తీ ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది టెంట్లు వేసుకుని రాత్రి, పగలు కాపలా ఉంటున్నారన్నారు. ఎవరైనా రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.