MNCL: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ లో 10మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో ఒకరు బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటిగా భావిస్తున్నారు. చత్తీస్ ఘడ్ పోలీసులు స్థానికంగా ధ్రువీకరించడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు సమాచారం లేదన్నారు.