KMR: జుక్కల్ మండలం హంగర్గ శివారులో శుక్రవారం రైతు వీరేశం అంతర్ పంటగా సాగు చేసినా 147 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. గ్రామానికి చెందిన రైతు సోయా, కంది పంటలో గంజాయిని అంతర్ పంటగా సాగు చేస్తున్నారని చెప్పారు. పక్కా సమాచారం మేరకు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.