KRNL: దసరా వేళ బిగ్సేల్ ఆఫర్లతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ నేరగాళ్లు తక్కువ ధరల్లో వస్తువులు అంటూ లింకులు పంపిస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు గెలుస్తారని మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.