PDPL: ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించకుంటే ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తామని సుల్తానాబాద్ మండల అధికారులు తెలిపారు. మండలంలోని గర్రెపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి దశలవారీగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా పనులు మొదలుపెట్టనివారి ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు.