NRML: జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సమావేశంలో అధికారులకు ఆదేశించారు. అంగన్వాడి భవనాలు,పాఠశాలల మరుగుదొడ్లు, ఉపాధి హామీ నిధుల పనులను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఈఈ చందునాయక్లు పాల్గొన్నారు.