గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహిళాలకు ప్రీ బస్సు, రూ. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తుందన్నారు.