TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం అయ్యారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కేటీఆర్.. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట గంగుల కమలాకర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కాసేపట్లో కేటీఆర్, జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు.