AP: నెల్లూరు(D) కావలి మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పోలిశెట్టిపై మత్స్యకారులు దాడి చేయగా, బంగారుపాళ్యం జాలర్లు పెద్ద కాపులను కట్టేశారు. గతంలో పట్టుకున్న తమిళనాడు బోట్లను, జువ్వెలదిన్నె హార్బర్ నుంచి తమిళ జాలర్లు మళ్లీ ఎత్తుకెళ్లడంతో వివాదం రేగింది. ఈ చోరీ వెనుక బీద మస్తాన్ రావు హస్తం ఉందని ఆరోపిస్తూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.