AP: ఆరు నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ లక్ష్యాలపై, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై దిశానిర్దేశం చేయనున్నారు. శాంతి భద్రతలపైనా డీజీపీ, ఎస్పీలతో సమీక్షించనున్నారు. ఈ క్రమంలో స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.