TG: శంషాబాద్ ఎయిర్పోర్టు వెనక ఏపీ CM చంద్రబాబు కృషి ఉందని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్ నోవాటెల్లో ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. ‘విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నాం. సరికొత్త సేవలు అందిస్తున్నాం. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం’ అని పేర్కొన్నారు.