అతి మంచితనం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎదుటివారు ఇబ్బంది పడతారేమోనని అడిగిందల్లా చేయడం, ఏదైనా విషయంలో నో చెప్పలేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. తమను అందరూ మంచివారు అనుకోవాలనే ధోరణితో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోరు. దీనివల్ల మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీపట్ల చులకనగా వ్యవహరించడం వంటివి చేస్తారు. అలాగే, అనవసర విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.