పెట్రోల్, డీజిల్ ధరలపై అనేక వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. చాలా మంది తమకు అవసరం లేకపోయినా ఇంధనం కోసం పరుగులు పెడుతున్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.