తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. మొదట జారీ చేసిన హాలిడేస్ జాబితాలో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఇవాళ జరగాల్సిన 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.