ప్రధాని మోదీ తనకు వ్యతిరేకంగా ఓ రాజ్యాంగ సవరణ తెచ్చుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ సవరణ ప్రకారం ఓ ప్రధాని జైలుకు వెళ్తే ఆయన రాజీనామా చేయాలన్నారు. గతంలో ఇందిరా గాంధీ ఉన్నత పదవులను న్యాయ సమీక్ష నుంచి రక్షించేందుకు ప్రయత్నించారని, కానీ మోదీ అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మోదీ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని షా అన్నారు.