TG: నాగర్కర్నూల్ జిల్లాలోని SLBC టన్నెల్ తవ్వకాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మన్నెవారిపల్లె ఔట్లెట్ వైపు 100 మీటర్లు, బ్రహ్మగిరి ఇన్లెట్ వైపు 12 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. లోకో ద్వారా సొరంగంలోని మట్టి, రాళ్లు బయటకు తరలిస్తున్నామని వెల్లడించారు.