TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భుజంగరావు బంధువుల ఇళ్లల్లోనూ, సూర్యాపేటలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.