TG: వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశానుసారమే ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. లంచ్మోషన్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించిందని వెల్లడించారు. అర్హులైన పేదలను గుర్తించి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులతో పాటు స్థానికేతరులూ భూదాన్ భూములను ఆక్రమించారని ఆరోపించారు.