ట్రంప్ తలచుకుంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపగలరని యూఎస్ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. టెహ్రాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకోవడం అనివార్యం కాదని వ్యాఖ్యానించారు. సైనిక తిరుగుబాటులు జరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాన్ని పొందాలనే నిశ్చయానికి ఇరాన్ రావొచ్చని పేర్కొన్నారు. వివిధ రక్షణ మార్గాలు కోల్పోయిన కారణంగా దాని గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉందన్నారు.