ఈ ఏడాది అక్టోబర్లో కొత్తగా 17.80 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు కార్మిక రాజ్య బీమా సంస్థ(ESIC) తెలిపింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన ఉద్యోగాల కంటే 3శాతం అధికమని పేర్కొంది. వీరిలో 3.5 లక్షల మంది మహిళలు, 42 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మరింత మందికి ఉద్యోగాలు కల్పించేలా 21,588 కొత్త సంస్థలను ESIC పరిధిలోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.