చైనా తన ఆయుధాలను వైవిధ్యంగా, అధునాతనంగా తీర్చిదిద్దుకుంటోందని అమెరికా పేర్కొంది. రెండు దశాబ్దాల క్రితం ఆ దేశం వద్ద చాలా తక్కువ సంఖ్యలో కాలం చెల్లిన అణ్వాయుధాలుండేవని యూఎస్ డిఫెన్స్ అధికారి మైకేల్ చేజ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చైనా అణు వార్హెడ్ల సంఖ్య 600కు చేరుకోవడంపై మైకేల్ ఆందోళన వ్యక్తం చేశారు.