ASR: పాడేరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రేపు (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఎంపీడీవో డేవిడ్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ సోనారి రత్నకుమారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న సమావేశానికి ప్రజా ప్రతినిధులు హాజరుకావాలన్నారు. అలాగే మండల స్థాయి అధికారులు తమ శాఖలకు చెందిన పూర్తి సమాచారంతో విధిగా రావాలని సూచించారు.