TG: అసెంబ్లీలో మాజీమంత్రి హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభకే కాదు.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు HYD వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి మాట్లాడే హక్కు లేదు’ అని పేర్కొన్నారు.