AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలతో కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా మంత్రులకు చంద్రబాబు ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు. అలాగే, ఇటీవల CRDA తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాలు కేటాయింపుపై చర్చించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు భోజన పథకం.. మున్సిపల్ చట్ట సవరణకు నిర్ణయం తీసుకోనున్నారు.