ప్రకాశం: అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. దోర్నాల మండలం చిన్నగుడిపాడులో VROగా పనిచేస్తున్న చిన్న కొండయ్య, మరియమ్మ దంపతులకు కొన్నేళ్లుగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం పెంచుకున్న చిన్న కొండయ్య తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మరియమ్మను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.