యెమెన్‌పై వైమానిక దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హూతీల మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు నిర్వహిస్తున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి తెలిపారు. ఈ దాడులకు తమ దేశ రక్షణమంత్రి కాట్జ్ అనుమతించినట్లు వెల్లడించారు. పవర్ ప్లాంట్లు, పోర్టు, చమురు నిల్వ స్థావరాలపై ఉధృతంగా దాడులు చేయనున్నట్లు పేర్కొన్నారు.