TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సభలో ప్రవేశపెట్టబోయే పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదన్నారు. 3 బిల్లులకు బీఆర్ఎస్ తరపున సవరణలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సభలో డివిజన్‌కు పట్టుబడతామని అన్నారు.