TG: త్వరలో పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో బస్తీలకు దగ్గరలోనే ఇళ్ల నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. దూరప్రాంతాల్లో ఇళ్లు ఇస్తే లబ్దిదారులు వెళ్లడం లేదని చెప్పారు. గ్రేటర్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని స్లమ్స్‌ను గుర్తించామని వెల్లడించారు.