AP: రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన చేసింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.