నిద్రలేమి, టీవీ, కంప్యూటర్ వాడకం, అధిక ఒత్తిడి కారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించి వీటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టీ బ్యాగ్స్‌ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి, పావుగంట కళ్లపై పెట్టుకోవాలి. టమాటా, నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు బాదం నూనె అప్లై చేసుకోవాలి. ఆహారంలో ఉప్పుని తగ్గించి తీసుకోవాలి.