ఉదయం బ్రేక్ ఫాస్ట్లో రెండు ఖర్జూరాలు, గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మలబద్ధకం ఉండదు. జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు.