అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలో కొనసాగినంత కాలం మాత్రమే తాను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా పని చేస్తానని క్రిస్టోఫర్ రే ప్రకటించారు. ఈ చర్యను ట్రంప్ స్వాగతించారు. క్రిస్టోఫర్ హయాంలో కారణం లేకుండానే తన ఇంట్లో సోదాలు జరిపారని ట్రంప్ ఆరోపించారు. క్రిస్టోఫర్ స్థానంలో భారతీయ అమెరికన్ కాష్ పటేల్‌ను ఇదివరకే ట్రంప్ ఎంపిక చేశారు.