NZB: ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీ అంగన్వాడీ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆట బొమ్మలను ప్రదానం చేశారు. అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. చిన్నారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యదర్శి శ్రీకాంత్, సభ్యులు తిరుపతి, విజయానంద్, తదితరులున్నారు.