AP: ప్రియుడి వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం పాచిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. 6 నెలల క్రితం మామ కుమారుడితో 17ఏళ్ల బాలికకు కుటుంబ సభ్యలు వివాహం చేశారు. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉంచుకుంటున్నారు.అదే గ్రామానికి చెందిన వసంత కుమార్తో బాలికకు పరిచయం ఉంది. బాలిక వద్ద నుంచి వసంత కుమార్ రెండు సవర్ల బంగారం తీసుకొని వేధింపులకు గురి చేస్తుండటంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.