2025 ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ప్రసారకర్తలు ఐసీసీకి ప్రతిపాదించారు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పాకిస్థాన్ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని ప్రసారకర్తలు ఐసీసీకి తెలిపారు.