కోనసీమ: ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు శనివారం తిరిగి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. గతంలో జనసేన నాయకులు మీటింగ్ అని చెప్పి తీసుకెళ్లి కండువాలు వేశారని అన్నారు. తిరిగి సొంత గూటికి చేరడం అనందంగా ఉందని వారు తెలిపారు.