TG: మీర్‌చౌక్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై రాజకీయాలు చేయవద్దని మంత్రి అన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అని.. ఉదయం 6గం.లకు ప్రమాదం జరిగితే.. 6.16గం.కు ఫైర్ ఇంజిన్ వచ్చిందన్నారు. ఎక్కడా ప్రభుత్వ నిర్లక్ష్యం లేదన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని.. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటించారు.