ATP: రాయదుర్గం పట్టణంలోని సీతారామంజినేయ కళ్యాణ మండపంలో నియోజకవర్గ మినీ మహానాడు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని మినీ మహానాడును విజయవంతం చేయాలని ఆదివారం కోరారు.