SRD: నారాయణఖేడ్ ST గురుకుల జూనియర్ కళాశాలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో MPC, BIPC గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యాదగిరి ఆదివారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 20న ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే కౌన్సెలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలన్నారు.