NLR: విడవలూరులోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సీతమ్మ అన్వేషణ కోసం బయలుదేరిన శ్రీరాముడు సాయంకాలం సంధ్యా సమయంలో రామతీర్థం సముద్ర తీరాన నడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలోనే శివలింగం ఏర్పాటు చేసి పూజలు చేసినట్లు భక్తులు చెబుతుంటారు.